Insurance | వడదెబ్బంటూ డ్రామా…

Insurance | వడదెబ్బంటూ డ్రామా…

Insurance | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం భీమిలి మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వడదెబ్బతో మృతిచెందినట్లు నమ్మించేందుకు ప్రయత్నించిన ఓ మహిళ.. అసలు తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. అనంతరం వడదెబ్బ కారణంగా కుప్పకూలిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే వైద్యులు పరీక్షలు నిర్వహించగా గొంతు బిగించి హత్య చేసినట్లు బయటపడింది.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు నాగమణిని అరెస్టు చేశారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవా? లేక ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్యకు పాల్పడిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply