31వ వార్డులో గడప గడపకు కారు

31వ వార్డులో గడప గడపకు కారు
- బిఆర్ఎస్ అభ్యర్థి జహంగీర్ జోరుగా ప్రచారం
వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షేక్ జహంగీర్ గురువారం జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మద్దతు దారులు కార్యకర్తలతో కలిసి వార్డు లోని కాలనీలలో తిరుగుతూ గడపగడపకు కారు ప్రచారం జోరుగా కొనసాగించారు. ప్రచారంలో ఓటర్ల నుండి అపూర్వ స్పందన లభించింది. మాజీ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి సహకారంతో ఇప్పటికే వార్డులో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయించామని,కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో లో వోల్టేజ్ సమస్య పరిష్కరించామని తెలిపారు.
తనపై నమ్మకంతో కార్ గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డులో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తానని, రేషన్ షాపును 31వ వార్డులోకి మారుస్తానని, పార్కుల అభివృద్ధి చేపడుతానని,సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, అంగన్వాడిని అభివృద్ధి పరుస్తానని, శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను నా సమస్యలుగా భావించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఓటర్లకు వివరిస్తూ మద్దతు కోరారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను అందరికీ అందించడమే తన బాధ్యతగా భావిస్తానని చెప్పారు.
ప్రజలకు సేవ చేయడం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తనను ఆదరించి అండగా నిలువ వలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తున్నదని వివరించారు. వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం,సైడ్ డ్రైనేజీల ఏర్పాటు వీధిలైట్ల ఏర్పాటు అదే విధంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించడమే తన ధ్యేయమని అన్నారు.ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తనను ఆదరించి ఆశీర్వదించి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించవలసిందిగా వార్డు ఓటర్లను జహంగీర్ కోరారు.
