చండీఘర్ – 112 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 95 పరుగులకు కుప్పకూలి ఓటమి పాలైంది. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 15.1 ఓవర్ లలోనే కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు.
.చివరిలో ఆండ్రూ రస్సెల్(17) గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డాడు. కానీ, యాన్సెన్ అతడిని బౌల్డ్ చేసి పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
యాజువేంద్ర చాహాల్ నాలుగు , జెన్సన్ మూడు వికెట్లు పడగొట్టగా, ఆర్ష దీప్, మాక్స్ వెల్, జెవియర్ ఒక్కో వికెట్ దక్కించుకుని పంజాబ్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించారు
సన్‌రైజర్స్‌పై 245 రన్స్ కొట్టిన పంజాబ్ కింగ్స్.. సొంతగడ్డపై 111కే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తుంది అనుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్యంగా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ చేతిలో కంగుతిన్న పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకొని కోల్‌కతాకు పెద్ద షాకిచ్చింది.
మలుపు తిప్పిన చాహల్
62తో పటిష్ట స్థితిలో ఉన్న కోల్‌కతాను చాహల్ దెబ్బకొట్టాడు. రహానేను ఎల్బీగా వెనక్కి పంపిన అతడు కాసేపటికే రఘువంశీని ఔట్ చేసి మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పాడు. అతడి స్పిన్ మాయాజాలంతో రింకూ సింగ్ స్టంపౌట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన రమన్‌దీప్ సింగ్ స్లిప్‌లో శ్రేయస్ చేతికి చిక్కాడు. అంతే.. యాన్సెన్ సూపర్ బాల్‌తో హర్షిత్ రానా()ను బౌల్డ్ చేసి కోల్‌కతాను ఆలౌట్ అంచుల్లోకి నెట్టాడు.
అయితే.. చాహల్ వేసిన 14వ ఓవర్లో ఆండ్రూ రస్సెల్(17) రెండో బంతిని లాంగాఫ్‌లో సిక్సర్‌గా మలిచాడు. అదే ఊపులో 78 మీటర్ల సిక్సర్, ఫోర్‌తో 16 రన్స్ సాధించాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ ఓవర్లో వైభవ్ అరోరా(0) ఆఖరి బంతికి వికెట్ కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా రస్సెల్ ఉన్నాడనే భరోసాతో ఉన్న కోల్‌కతా ఆశల్ని ఆవిరి చేస్తూ యాన్సెన్ తొలి బంతికే బౌల్డ్ చేశాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ అనూహ్యంగా 16 పరుగుల తేడాతో ఓడిపోయింది
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ టాపార్డర్ వైఫల్యంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల విజృంభణతో పంజాబ్ 15.3 ఓవర్లకే ఆలౌటయ్యింది. పేసర్ హర్షిత్ రానా(3-25) నిప్పులు చెరగగా.. స్పిన్ ద్వయం వరుణ్ చక్రవర్తి(2-21), సునీల్ నరైన్(2-14)లు తిప్పేశారు. దాంతో, 111 పరుగులకే పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.
టాస్ గెలిచి దూకుడు ఇన్నింగ్స్ ఆరంభించింది పంజాబ్. ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య(22), ప్రభ్‌సిమ్రన్ సింగ్()లు బౌండరీలతో చెలరేగి జట్టుకు శుభారంభం ఇచ్చారు. అన్రిచ్ నోర్జి ఓవర్లో.. రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత వైభవ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్(30) వరుసగా 4, 6, 4 బాదగా.. ఐదో బంతిని ప్రియాన్ష్ లాంగాఫ్‌లో బౌండరీకి తరలించాడు. దాంతో పంజాబ్ స్కోర్ 3 ఓవర్లకే 30 దాటింది. దాంతో, మళ్లీ అయ్యర్ సేన రెండొదలు కొట్టడం ఖాయం అనుకున్నారంతా.
దంచికొడుతున్న పంజాబ్ కింగ్స్ ఓపెనర్లను కట్టడి చేసేందుకు కెప్టెన్ అజింక్యా రహానే బంతిని హర్షిత్ రానా(3-25) చేతికి ఇచ్చాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన ప్రియాన్ష్.. రెండో బంతికి ఫైన్ లెగ్‌లో పెద్ద షాట్ ఆడాడు. కానీ, అక్కడే కాచుకున్న రమన్‌దీప్ సింగ్ క్యాచ్ అందుకున్నాడు. 39 వద్ద పంజాబ్ తొలి వికెట్ పడింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(0) కీలక ఇన్నింగ్స్ ఆడతాడనుకుంటే.. సిక్సర్‌కు యత్నించి రమన్‌దీప్ చేతికి చిక్కాడు. అంతే.. పంజాబ్ వికెట్ల పతనం మొదలైంది. ఆ కాసేపటికే జోష్ ఇంగ్లిస్()ను వరుణ్ చక్రవర్తి(2-21) బౌల్డ్ చేసి మూడో వికెట్ అందించాడు.
పవర్ ప్లే ముగుస్తుందనగా రెండు సిక్సర్లు బాదిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ను హర్షిత్ డగౌట్‌కు పంపాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(7) మరోసారి నిరాశపరచగా.. ఆ తర్వాత రంగంలోకి దిగిన సునీల్ నరైన్ (2-14) సైతం వికెట్ల వేట కొనసాగించాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యాన్ష్ షెడ్గే(4), మార్కో యాన్సెన్(1)లను పెవిలియన్ పంపాడు. సహచరులు వరుసగా ఔట్ అవుతున్నాశశాంక్ సింగ్(18) ఒంటరి పోరాటం చేశాడు. అయితే.. అతడిని ఎల్బీగా ఔట్ చేసిన వైభవ్ అరోరా పంజాబ్‌ను ఆలౌట్ అంచున నిలిపాడు. ఆఖర్లో గ్జావియర్ బార్ట్‌లెట్(11) ధాటిగా ఆడి జట్టు స్కోర్ 100 దాటించాడు. అయితే.. 15.3వ ఓవర్లో అతడు రనౌట్ కావడంతో పంజాబ్ ఇన్నింగ్స్ 111 వద్ద ముగిసింది