76RR Batch | ఓటమినే మెట్లుగా మార్చుకుని..

76RR Batch | ఓటమినే మెట్లుగా మార్చుకుని..

76RR Batch | ఓటములను విజయానికి మెట్లుగా మార్చుకున్న వసుంధర
ఐదు సార్లు ఫెయిల్ అయినా పట్టువదలని ఐపీఎస్ ఆఫీసర్
ఖమ్మం ఏసీపీగా వసుంధర యాదవ్ సేవలు
మేడారం జాతరలో ‘లేడీ సింగం’గా ప్రశంసలు
మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన వసుంధర యాదవ్

76RR Batch | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : చాలా మంది ఒకట్రెండు సార్లు ఫెయిల్ అయితేనే నిరాశతో తమ లక్ష్యాన్ని వదిలేస్తారు. కానీ వరుస అపజయాలు ఎదురవుతున్నా ఆమె వెనకడుగు వేయలేదు. ప్రతీ ఓటమి నుంచి గుణ‌పాఠం నేర్చుకుంది. లోపాలను సరిదిద్దుకుంటూ, రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగారు. విజయం సాధించే వరకు విశ్రమించకుండా పట్టుదలను ప్ర‌ద‌ర్శించింది. చివరికి ఆమె కష్టానికి ఫలితం దక్కింది. ఆరో ప్రయత్నంలో అత్యున్నతమైన IPS (Indian Police Service)కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఏసీపీ (Assistant Commissioner of Police) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖాకీ యూనిఫాంలో ఆమె కనిపిస్తున్న తీరు ఎంతో మంది యువతులకు స్ఫూర్తినిస్తోంది. ఓటమి అనేది మన ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, అది ముగింపు కాదని,
లక్ష్యం పెద్దదైనప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడి పోరాడాల‌ని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని వసుంధర యాదవ్ నిరూపించారు. గెలిచినప్పుడు లోకం నిన్ను గుర్తిస్తుంది, కానీ ఓడిపోయినప్పుడు నిన్ను నువ్వు గుర్తిస్తేనే.. వసుంధర యాదవ్‌లా అద్భుతాలు సృష్టించవ‌చ్చు.

వసుంధర యాదవ్ పోరాటం యువతకు స్ఫూర్తి

వసుంధర యాదవ్ వరుసగా ఐదుసార్లు సివిల్ సర్వీసెస్ పరీక్షలలో విఫలమైనప్పటికీ పట్టువదలక, ఆరవ ప్రయత్నంలో Women IPS Officers Real Life Stories సాధించి ఐపీఎస్ అధికారిణిగా నిలిచారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజంగఢ్ కు చెందిన ఆమె, ప్రస్తుతం తెలంగాణ కేడర్ లో ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.

అపజయాల నుంచి విజయ శిఖరాలకు

సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వసుంధరకు చిన్నప్పటి నుంచే పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యం ఉండేది. అయితే యూపీఎస్సీ (UPSC) పరీక్షల్లో వరుస అపజయాలు ఎదురయ్యాయి. అయినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆరో ప్రయత్నంలో 2023 బ్యాచ్ ఐపీఎస్ సాధించి తన కలను నిజం చేసుకున్నారు. ఈమె ఐఏఎస్ అధికారి అజయ్ యాదవ్ ను వివాహం చేసుకోవడంతో యూపీ నుండి తెలంగాణ కేడర్ కు బదిలీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 76 RR Batch ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ ACP of కల్లూరు సబ్ … గా బాధ్యతలు చేపట్టి, శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేస్తున్నారు.

‘లేడీ సింగం’గా సోషల్ మీడియాలో ప్రశంసలు

మేడారం జాతర వంటి భారీ జనసందోహాన్ని నియంత్రించడంలో ఆమె చూపిన చొరవకు సోషల్ మీడియాలో ‘లేడీ సింగం’గా మేడారం జాతరలో ‘లేడీ సింగం’ హల్‌చల్.. ఎవరీ వసుంధర యాదవ్? నెట్టింట … గా నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు.

CLICK HERE TO READ Operation Vajrapahaar | ‘ఆపరేషన్ వజ్రపహార్’ AnDhra Prabha Top News

CLICK HERE TO READ MORE

Leave a Reply