బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

దిగువకు నీటి విడుదల

బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్ర‌ప్ర‌భ : మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకాలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను నేను ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నాలుగు నెలల పాటు నీటిని విడుదల చేయాలి. ఇందులో భాగంగానే మూడు రాష్ట్రాల అధికారులు, సెంట్రల్ వాటర్ కమిషన్ సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు గోదావరి నీటిని వదిలారు.

కార్యక్రమంలో కేంద్ర జల సంఘం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చరణ్‌, జూనియర్ ఇంజనిర్ సాయి ప్రణీత్‌, శ్యామ్ ప్రకాష్, జలవనరుల శాఖ (మహారాష్ట్ర) నాందేడ్ ఇరిగేషన్ సి.ఆర్. బన్సోద్‌ను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా, సి.డి. పోట్దార్‌ను సబ్-డివిజనల్ ఆఫీసర్‌గా డి. గవనే, పోచంపాడు ఇరిగేషన్ అధికారులు కొత్త రవి, ఎన్. శ్యామ్ కుమార్, ఎస్. విన్యాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.