9వ తేదిన‌ బనగానపల్లెకు ముఖ్యమంత్రి రాక..

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కలెక్టర్ ఎస్పీ…

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9 వ తేదీన నంద్యాల జిల్లా బనగానపల్లె కు వస్తున్నట్లు ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం తెలిపారు. బనగానపల్లె మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష నిర్వహిస్తున్నరు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రజల కోసం చేయాల్సిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, రవాణా, ఇతర అవసరాలపై అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తున్న రు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించరు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ షొరాణ్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.