గాలివాన… బీభత్సం… రైతుల…. ఆగమాగం

గాలివాన… బీభత్సం… రైతుల…. ఆగమాగం

కుంటాల ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో శనివారం అకాల వర్షానికి కల్లాల వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న జొన్న వరి పంటలు తడిసిపోయాయి పంటలను కాపాడుకునేందుకు టార్పలిన్ కవర్లతో కర్చకులు కల్లాల వైపు పరుగులు తీశారు కుప్పలపై నీరు నిలవడంతో తొలగించేందుకు అవస్థలు పడ్డారు వాతావరణంలో ఒకేసారిగా మబ్బులు మార్పుల కారణంగా తేమ ఇతర కోరీలు పెడతారేమోనని అన్నదాతలు ఆగమాగం అయి ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ నిబంధనలు సడలించి కొనుగోలు ముమ్మరం చేస్తే యాసంగి పంటలు గట్టెకుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు

ఇప్పటికే గన్ని సంచుల కృత మూలంగా మండల వ్యాప్తంగా కళ్ళల వద్ద ధాన్యం నిల్వ ఉండడంతో రైతులు దిగులుతుంది ఆందోళన చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలులో తీవ్ర జాప్యం చేయడంతో ఆందోళన చేస్తున్నారు అకాల వర్షం గాలివాన బీభత్సంతో రైతులు ఉరుకులు పరుగులు తీసి పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు దీంతో వెంటనే ప్రభుత్వం ముమ్మరంగా మొక్కజొన్న కొనుగోలను వేగవంతంగా చేపట్టాలని రైతులు వాపోతున్నారు

Leave a Reply