GST Collections June 2026 | 14% పెరిగిన జీఎస్టీ ఆదాయం

GST Collections June 2026 | 14% పెరిగిన జీఎస్టీ ఆదాయం

GST Collections June 2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జూన్ నెలలో గణనీయంగా పెరిగాయి. జూన్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు రూ.1.95 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు వెల్లడించింది. ఇది గతేడాది జూన్‌తో పోలిస్తే 14 శాతం అధికం.

కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.35 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. మరోవైపు దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు 34.6 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరాయి. దీంతో మొత్తం పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది.

ఇక జూన్ నెలలో జీఎస్టీ రీఫండ్ల రూపంలో రూ.32,436 కోట్లు చెల్లించినట్లు కేంద్రం తెలిపింది. రీఫండ్లను సర్దుబాటు చేసిన అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ వసూళ్లలో ఈ పెరుగుదల దేశీయ ఆర్థిక కార్యకలాపాలు మెరుగు పడుతున్నాయనే సంకేతంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.