Operation Vajrapahaar | ‘ఆపరేషన్ వజ్రపహార్’ AnDhra Prabha Top News

Operation Vajrapahaar | ‘ఆపరేషన్ వజ్రపహార్’ AnDhra Prabha Top News

శిలాతోరణం, శ్రీవారి పాదాల వద్ద నాఖాబందీ

భక్తుల భద్రతకు కూంబింగ్

Operation Vajrapahaar |
Operation Vajrapahaar |

తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణను మరింత పటిష్టం చేసే దిశగా తిరుపతి జిల్లా పోలీసులు “ఆపరేషన్ వజ్రపహార్” కార్యక్రమాన్ని శనివారం విస్తృతంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఉదయం ప్రత్యేక నాఖాబందీ చేపట్టారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శిలాతోరణం, శ్రీవారి పాదాలు ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5.30 గంటలకు శిలాతోరణం జంక్షన్ వద్ద సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన అనంతరం ఆపరేషన్ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తిరుమలకు వచ్చే ప్రతి మార్గాన్ని పర్యవేక్షిస్తూ పోలీసులు నాఖాబందీ నిర్వహించారు.

Operation Vajrapahaar : తనిఖీలో బిజీబిజీ

కొండపైకి వచ్చే వాహనాలను ఆపి పత్రాలు, సామగ్రి పరిశీలించడంతో పాటు అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖతో పాటు టీటీడీ విజిలెన్స్, ఏపీ ఫారెస్ట్ శాఖ, టీటీడీ ఫారెస్ట్ విభాగం, ఫైర్ సర్వీసెస్, టీటీడీ రెవెన్యూ, రెవెన్యూ శాఖ, బాంబ్ డిస్పోజల్ టీమ్స్, ఎక్సైజ్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. సంయుక్తంగా కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ తిరుమల పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

Operation Vajrapahaar : పోలీసుల జల్లెడ

అడవి మార్గాలు, నిర్జన ప్రాంతాలు, పార్కింగ్ ప్రాంతాలు, చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలో నిరంతరం అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేక ప్రణాళికతో తనిఖీలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ సిబ్బందికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

CLICK HERE TO READ MORE : 23198students | 91.41 శాతం ఉత్తీర్ణత నమోదు

CLICK HERE TO READ MORE

Leave a Reply