నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…

నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…
ఘంటసాల – ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునర్ధరించాలని, కేంద్ర ప్రభుత్వమే పథకానికి నిధులు ఇవ్వాలని, రాష్ట్రాలపై భారం తగ్గించాలని,రెండు పూటలా పని విధానం రద్దుచేసి ,ఒక పూట విధానం అమలు చేయాలని, ఐరిస్ విధానం రద్దుచేసి మస్టర్ ద్వారా పాత విధానం తో హాజరు వేయాలని, ఆదివారం సెలవు కొనసాగించాలన్నారు.
సమ్మర్ అలవెన్సులు పునరుద్ధరణ చేసి అమలు చేయాలని, ఫిబ్రవరి నుండి పనిచేసిన ఉపాధి కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, అదనపు పనులు గుర్తించి కార్డు కలిగిన ప్రతి జాబ్ కార్డు వారికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 600 కనీస వేతనం ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 20 తేది న రాష్ట్ర రాజధాని ప్రాంతంలో తాడేపల్లి నందు గల కమీషనర్ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు శీలం నారాయణరావు ఉపాధి కార్మికులకు పిలుపు ఇవ్వడం జరిగింది.
ఘంటసాల మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తున్న పని ప్రదేశంలో కార్మికులను కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిరసన కార్యక్రమం సంబంధించిన కరపత్రం కార్మికులతో కలిసి ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు మేడంకి వెంకటేశ్వరరావు, ఉపాధి కార్మికులు మేడంకి ప్రసాదరావు, కాకి వెంకటేశ్వరావు, మొవ్వ వెంకటేశ్వరరావు, పడమట శ్రీనివాసరావు, అయోధ్య హేమ సుందరరావు , పడమట వెంకటేశ్వరమ్మ, మొవ్వ వెంకటరమణ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
