Results | తల్లిదండ్రులూ ఇది మీకోసమే!

Results | తల్లిదండ్రులూ ఇది మీకోసమే!
Results | ఫలితాల సమయంలో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది?
తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సంకేతాలు
పిల్లలకు చెప్పాల్సిన సరైన మాటలు
చేయకూడని పెద్ద తప్పులు ఏమిటి?
ఒత్తిడిని తగ్గించే మార్గాలు
మార్కులు తక్కువ వచ్చినా భవిష్యత్తు ఎలా నిర్మించాలి?
Results | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. కొందరికి ఆశించిన మార్కులు రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. అయితే, ఫలితం ఏదైనా సరే.. ఈ సమయంలో విద్యార్థుల కంటే వారి తల్లిదండ్రుల పాత్రే అత్యంత కీలకం. మార్కులు తక్కువ వచ్చాయని కోప్పడటం కంటే, మీ బిడ్డకు “మేమున్నాం” అనే ధైర్యం చెప్పాల్సిన సమయం ఇది.
Results | ఫలితాల వేళ.. పిల్లల ప్రవర్తనను గమనించండి..
ఫలితాలు వచ్చిన తర్వాత పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో తల్లిదండ్రులు నిశితంగా పరిశీలించండి. ఈ లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే పరామర్శించండి.
ఎవరితో మాట్లాడకుండా గదిలోనే ఒంటరిగా ఉంటున్నారా?, సరిగ్గా భోజనం చేయడం లేదా? , ముఖంలో విపరీతమైన ఆందోళన, భయం కనిపిస్తున్నాయా?, ఫలితం గురించి అడిగితే విసుక్కోవడం లేదా ఏడవడం చేస్తున్నారా? అనే విషయాలను తల్లిదండ్రులు గమనించండి.
Results | తల్లిదండ్రులు చేయాల్సినవి.. చేయకూడనివి..
పోలికలు వద్దు… “పక్కింటి అబ్బాయికి అన్ని మార్కులు వచ్చాయి.. నీకేంటి ఇవి?” అని ఎప్పుడూ అనకండి. ప్రతి బిడ్డకు ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. ఒక పరీక్షా పత్రం మీ బిడ్డ భవిష్యత్తును నిర్ణయించదు. ఫెయిలైనా లేదా మార్కులు తక్కువ వచ్చినా.. “పర్వాలేదు“, సప్లిమెంటరీ ఉంది లేదా వచ్చేసారి ఇంకా బాగా చదువుకోవచ్చు” అని ప్రేమగా చెప్పండి. ఆ మాట వారు ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది.
Results | క్షణికావేశానికి తావివ్వకండి..
ఫలితాలు రాగానే తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే పిల్లలను ఒంటరిగా వదలకండి. వారితో కలిసి సమయం గడపండి, సినిమాకో లేదా బయటకో తీసుకెళ్లి వారి మనసు మార్చండి. నేటి ప్రపంచంలో కేవలం ఇంటర్ మార్కులతోనే జీవితం ఆగిపోదు. ఎన్నో ప్రత్యామ్నాయ కోర్సులు, నైపుణ్య ఆధారిత వృత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి వివరించి వారిలో ఆత్మవిశ్వాసం నింపండి. విద్యార్థులారా.. ఒక పరీక్షలో విజయం సాధించకపోవడం అంటే జీవితంలో ఓడిపోవడం కాదు. తల్లిదండ్రులూ.. మీ పిల్లలు సాధించిన మార్కుల కంటే వారి చిరునవ్వు, వారి ప్రాణమే మీకు ముఖ్యం. ఒక్క క్షణం ఓపికతో మీ బిడ్డకు ధైర్యం చెప్పండి.. అది వారి జీవితాన్నే మార్చవచ్చు.
