అవనిగడ్డ ఎమ్మెల్యేకు టీడీపీ నేతల శుభాకాంక్షలు

అవనిగడ్డ ఎమ్మెల్యేకు టీడీపీ నేతల శుభాకాంక్షలు

మండలి బుద్ధప్రసాద్‌ను సత్కరించిన పార్టీ నాయకులు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు.

టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు, మోపిదేవి జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రావి రత్నగిరి ఎమ్మెల్యేను సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండే రాఘవ, మండలి రామ్మోహనరావు, కంచర్ల ఆనంద్, నాగిడి రాంబాబు, విశ్వనాధపల్లి పాప, బాబావలీ, కొల్లూరి వాసు, సోమిరెడ్డి, మెగావత్ గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply