ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు…
ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లని ఊట్కూర్ ఎంపీడీవో కొండన్న, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డి. యగ్నేశ్వర్ రెడ్డి,అవుసలోనిపల్లిసర్పంచ్ ఎల్లమ్మతిమ్మప్పఅన్నారు. సోమవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అవుసలోనిపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించినట్లుతెలిపారు.
ప్రభుత్వం రాష్ట్రంలో ఆడపడుచుల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు మంజూరు చేస్తుందని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రూ 5 లక్షలు విడుదలవారీగా చెల్లిస్తుందన్నారు. పేదల సొంతింటి కల నెరవేంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. లబ్ధిదారులు సకాలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలనిఅన్నారు.
ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడంతో పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్నప్ప, పంచాయతీ కార్యదర్శి మాధురి, మాదాసి కుర్వ సంఘం తాలూకా అధ్యక్షులు అంజప్ప, తదితరులు పాల్గొన్నారు.
