జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికైన యశ్వంతిక

జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికైన యశ్వంతిక

నర్సింహులపేట, ఆంధ్రప్రభ:

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట గ్రామానికి చెందిన యశ్వంతిక జాతీయ స్థాయి జూడో పోటీలకు ఎంపికై ప్రతిభ చాటింది.

యశ్వంతిక తండ్రి బాల్నే శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని రీజినల్ క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో 44 కేజీల విభాగంలో అద్భుత ప్రదర్శన కనబర్చి విజేతగా నిలిచింది.

ఈ పోటీల్లో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న యశ్వంతిక, ఈ నెల 10న చండీగఢ్‌లో జరిగే జాతీయ స్థాయి జూడో పోటీలకు అర్హత సాధించింది.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ యశ్వంతికను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.