వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక కృషి.
వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక కృషి.
ఊట్కూర్, (ఆంధ్రప్రభ) వేసవికాలంలో తాగునీటిఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక కృషి చేస్తామని ఊట్కూర్ ఉపసర్పంచ్ ఆర్.రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం. భరత్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కొత్త కాలనీలో నూతన పైప్లైన్ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊట్కూర్ మండల కేంద్రంలోని 16 వార్డుల్లో విద్యుత్ త్రాగునీటి సమస్యలు రాకుండా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. శ్రీరామ్ నగర్ కొత్త కాలనీలో నీటి ఎద్దడి ఉండడంతో త్రాగునీరు సమస్యను పరిష్కరించేందుకు నూతనంగా పైప్ లైన్ వేస్తున్నామని, ఆయా కాలనీలలో అవసరమైన చోటనీటి సరఫరాలకు కావలసిన వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తడి పొడి చెత్త వేరువేరుగా సత్తా సేకరణ వాహనంలో వేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో అందరూ భాగస్వాములుకావాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించడంతో సమస్య వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నామనిఅన్నారు. నూతన పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ నీటి ఎద్దడి తీరుస్తున్నాడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కు మౌనిక లక్ష్మణ్, భరత్, నాయకులు భక్తితిమ్మప్ప, వెంకట్ రాములు, శ్రీనివాస్, నరసింహ, బలరాం అమీర్ తదితరులు పాల్గొన్నారు.
