ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని చౌటుప్పల్ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య సూచించారు.

సోమవారం చౌటుప్పల్ మండలంలోని ఎనగంటి తండా, అల్లాపురం, పీపల్ పాహాడ్, దేవలమ్మ నాగారం, కొయ్యలగూడెం, చిన్నకొండూరు, మసీదుగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ, మధ్య దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్మి నష్టపోకూడదన్నారు. ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ. 2,389, బి-గ్రేడ్ ధాన్యానికి రూ. 2,369 గిట్టుబాటు ధర చెల్లిస్తున్నదని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కల్లాలలోనే శుభ్రం చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు, హమాలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ వీరాభాయి, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, కొయ్యలగూడెం సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్, అల్లాపురం సర్పంచ్ టేకుల మంజుల, ఎనగంటి తండా సర్పంచ్ కరెంటోతు రాజు నాయక్, పీపల్ పాహాడ్ సర్పంచ్ పులంగారి నాగేశ్వరి, దేవలమ్మ నాగారం సర్పంచ్ సురుగు గౌరీ, చిన్నకొండూరు సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, మసీదుగూడెం సర్పంచ్ మర్రి వంశీధర్ రెడ్డి, ఏపీఎం యు యాదయ్య, సీసీలు కల్పన, నరసింహ, విమల, ఏఈఓలు, మండల సమాఖ్య అధ్యక్షురాలు అలివేలు, కోశాధికారి శంకరమ్మ, సంఘ బంధం కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply