సాదా బైనామాల పూర్తి ప్రక్రియ వేగవంతం చేయాలి: ఆర్డీవో హరికృష్ణ

సాదా బైనామాల పూర్తి ప్రక్రియ వేగవంతం చేయాలి: ఆర్డీవో హరికృష్ణ

చిట్యాల, ఆంధ్రప్రభ:

పెండింగ్‌లో ఉన్న రైతుల వ్యవసాయ భూముల సాదా బైనామాల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని భూపాలపల్లి ఆర్డీవో పి. హరికృష్ణ అధికారులను ఆదేశించారు.

గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల తహసీల్దారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సాదా బైనామాల కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన రైతులకు త్వరగా పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

సమావేశంలో మూడు మండలాల ఆర్‌ఐలు రాజేందర్, శివకృష్ణ, సంతోష్, జీపీఓలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply