4to5 days | వాతావరణ శాఖ కీలక అప్‌డేట్!
4to5 days | వాతావరణ శాఖ కీలక అప్‌డేట్!
4to5 days | తెలంగాణలో ఎండలకు త్వరలో బ్రేక్
కేరళలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు
జూన్ తొలి వారంలో తెలంగాణలోకి ప్రవేశం
ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
4to5 days | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలకు బ్రేక్ పడే సమయం ఆసన్నమైంది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా జూన్ 1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు, ఈసారి ఐదు రోజులు ముందే అంటే మే 26 నాటికే కేరళ తీరాన్ని తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.
కేరళలోకి ప్రవేశించిన వారం రోజుల్లోనే రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఈ క్రమంలోనే జూన్ మొదటి వారంలో ఇవి తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించనున్నాయి. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాక 4 నుంచి 5 రోజులు ఆలస్యం కానుంది.
రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాగల కొన్ని రోజుల పాటు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
CLICK HERE TO READ Shock for air passengers I 1200 Cancilled I విమాన ప్రయాణికులకు షాక్
