సబ్సిడీ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోండి

సబ్సిడీ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోండి
రాప్తాడు, ఆంధ్రప్రభ : రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పొందెందుకు దరఖాస్తు చేసుకోవాలని రాప్తాడు వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ చైతన్య పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఏవో కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకటన తెలియజేశారు.రాప్తాడు మండలంలోని సన్న చిన్న కారు రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు.
ఎస్సీ ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ ఇతరులకు 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు మంజూరు చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19వ తేదీ ఆఖరి రోజు అని తెలిపారు. ఎస్.ఏ.ఎం పథకం కింద ట్రాక్టర్లు ట్రిల్లర్లు రోట వేటర్లు నూర్పిడి యంత్రాలు మడకలు గొర్రు వివిధ రకాల వ్యవసాయ పరికరాలు అలాగే 40 హెచ్ పి సామర్థ్యం కలిగిన 2 డబ్ల్యూ డి 4 డబ్ల్యు డి ట్రాక్టర్లు కూడా ఈ పథకంలో పొందవచ్చు.
రాప్తాడు మండలానికి 22.32 లక్షలు మాత్రమే కేటాయించారు. రైతులు దరఖాస్తులు అధికారిక వెబ్ సైట్ http:eseed.ap.gov.in/ ద్వారా ఆన్ లైన్ చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఆన్ లైన్ లాటరీ విధానంలో ఉంటుందన్నారు.గ్రామాల వారిగా లాటరీ నిర్వహిస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
