డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటాం

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటాం

-దాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
–జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

తొర్రూరు, ఆంధ్రప్రభ: జిల్లావ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరి తెలిపారు. డివిజన్ కేంద్రంలోని దుబ్బ తండా సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అక్కడి మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఇళ్ల వద్ద నీరు, విద్యుత్, రహదారులు తదితర ప్రాథమిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని స్పష్టం చేశారు. ఫైరవీ కారులకు, అనర్హులకు లబ్ధిదారుల జాబితాలో చోటు లేదన్నారు. అర్హులకే ఇల్లు దక్కాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత పకడ్బందీగా ఎంపిక విధానాన్ని రూపొందించామని తెలిపారు.

ఎవరైనా అనర్హులు జాబితాలో ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మండలంలోని వెలికట్ట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ధాన్యాన్ని నిబంధన మేరకు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు.కావాల్సిన గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ పురుషోత్తం, పౌరసరఫరాల శాఖ అధికారి రమేష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.