మొక్కజొన్న ,వరి ధాన్యం, కొనుగోల్లు వేగవంతం చేయాలి
మొక్కజొన్న ,వరి ధాన్యం, కొనుగోల్లు వేగవంతం చేయాలి
- కొనుగోలు కేంద్రాలు సందర్శించిన డిసిఒ వాల్యా నాయక్
చిట్యాల, ఆంధ్రప్రభ : మొక్కజొన్న ,వరి ధాన్యం, కొనుగోల్లు వేగవంతం చేయాలని, భూపాలపల్లి డిసిఒ వాల్యా నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని మొక్కజొన్న,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు . ఈ సందర్భంగా డి సి ఓ వాలియా నాయక్, కొనుగోలు నిర్వాహకులు, రైతులతో కొనుగోలు ప్రక్రియ గురించి చర్చించి వివరాలు తెలుసుకున్నారు. చిట్యాల సెంటర్లో కాంటా అయిన రైతులకు వెంటనే ట్రక్ చిట్ లు ఇవ్వాలని నిర్వాహకుల ఆదేశించారు.
లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తో మాట్లాడి సాయంత్రం మూడు లారీలు చిట్యాల సెంటర్కు పంపిస్తానని కాంట్రాక్టర్ తెలిపారు. చిట్యాల పరిధిలోని చల్లగరిగే , జడలు పేట, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని కావున అక్కడి రైతులు అక్కడే ట్రక్ చిట్ లు తీసుకొని గోడౌన్ కు వెళ్లాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలోచిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మార్క్ మార్క్ ఫెడ్ డిఎం శ్రీదేవి , అసిస్టెంట్ రిజిస్టర్ రాజు, చిట్యాల సీఈవో మొగిలి , సెంటర్ ఇంచార్జ్ గంగాధరి రవీందర్,రైతులు పాల్గొన్నారు.
