3days | ఆదివాసీల జీవనం మానవతకు నిదర్శనం

3days | ఆదివాసీల జీవనం మానవతకు నిదర్శనం

3days | సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతున్న వైనం
ఆచార వ్యవహారాలను నేటి తరానికి అందిస్తున్న ఐక్యతారాగం
రంపచోడవరం వేదికగా ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఉత్స‌వాలు

3days | ”ఆదివాసీల ఆచార వ్యవహారాలు, ఇలవేల్పూలు, పూజా విధానాలు, పండుగలు, కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు, వేష భాషలు, ఆట పాటలు, సామాజిక మానవ సంబంధాలు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఆదివాసీలు ఆస్థిత్వం మూలంగా, విజ్న్హాన శాస్త్ర సాంకేతికతలు – వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎన్నో మతాలు, కులాలుగా సమాజం విడిపోయినా నేటికీ చెక్కు చెదరని ఆపూర్వ బంధంతో ఐక్యతతో ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ఘనత ఆదివాసీలకే దక్కుతుంది. రేలా రేలా అనే పదం కేవలం ఒక పాట కాదు. అది ఆదివాసీల అడవి తల్లి గుండె చప్పుడు. అద్భుతమైన కళా రూపాలను ప్రపంచానికి చాటి చెప్పెందుకు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ రేలా ఉత్సవాలకు సిద్ధ‌మవుతున్నాయి.

3days | చింతూరు, ఆంధ్రప్రభ: ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింభం గిరిజనల రేలా పండుగ. ఈ పండుగను ప్రతి ఆదివాసీ బిడ్డ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటుంటారు. ఇలాంటీ ప్రఖ్యాతి గల రేలా పండుగను ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందకు నడుంబిగించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు రేలా పండుగను నిర్వహించేందకు ఆదివాసీ గిరిజన సంఘాలు సిద్దమవుతున్నాయి. ఈ రేలా పండుగ ద్వారా ఆదివాసీల ఐక్యతను చాటి చెప్పెలా ఆదివాసీ గిరిజన సంఘాలు కృషిచేస్తున్నాయి.

రేల పండుగ విశిష్టత
గిరిజన సంప్రదాయాలు, సంస్కృతుల్లో భాగం రేలా పండుగ. ఇది సంప్రదాయ పండుగ దీనిని పూర్వం నుంచి ఇప్పటీ వరకు ఆచారంగా సంప్రదాయబద్ధంగా గిరిజనలు నిర్వహిస్తున్నారు. ఆదివాసీల ప్రాచీన సంప్రదాయం ప్రకారం అలసిపోయిన ఆదివాసీలు అలసట తీర్చుకునేందుకోసం (వినోదం పోందటానికి) ఆట – పాట ప్రారంభించారని అప్పటీ నుంచి ఈ ఆట – పాటనే కోనసాగిస్తూ వచ్చారని దీంతోనే రేలా పాట అనేది పుట్టుకోచ్చిందని ఆదివాసీ పెద్దలు చెపుతుంటారు. ప్రాచీన కాలంలో వినోదం కోసం టీవీలు, రేడియాలు లేనప్పుడు ఈ రేలా పాటను ఆదివాసీలు తమ వినోదం కోసం రూపోందించుకున్నారని చరిత్రలు చెపుతున్నాయి.

రేలా అంటే ఆనందం
ఈ ఆనందం కోసం పాడేదాన్ని రేలా పాట అంటారు. పూర్వీకుల చరిత్రను చెప్పుకుంటూ, తమ ఆచారాలను, జీవనవిధానాన్ని పాటగా బాణి కట్టి పాడతారు. ఈ పాటకు అనుగుణంగా అడుగులు వేస్తూ ఈ రేలా పండుగను నిర్వహిస్తుంటారు. ఈ రేలా పండుగను ఎక్కువగా వ్యవసాయం పనులు పూర్తి అయిన తరువాత యువతీ, యువకులు కలిసికట్టుగా భేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతుంటారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమే ఈ రేలపండుగ (రేలపండు) ఆదివాసీ భాషలో అంటారు. ఈ పండుగను సంప్రదాయ పండుగ భావిస్తారు. దీనిని పూర్వం నుంచి ఇప్పటి వరకు ఆచారంగా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. తమ ఆచార వ్యవహారాలు పాటిస్తూ రేలా పండుగ సంబరం కనుమరుగవకుండా ఇప్పటీ వరకు కాపాడుకుంటూ వస్తున్నారు.

రేలా పండుగలు అనేక రకాలు
ఆదివాసీల ఆచార వ్యవహారాల్లో రేలా పండుగ అనేది ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగివుంది. ఈ పండుగ గిరిజనల్లో ఆనందంతో పాటు ఆచార వ్యవహారాల్లో పాలుపంచుకుంటుంది. ఈ పండుగను గిరిజనలు అనేక రకాలుగా నిర్వహిస్తుంటారు. పెళ్లి రేలా, భూమి రేలా, వెన్నెల రేలా, చావు రేలా, తర్రు రేలా, పండుగ రేల ఇంకా పలు రకాల రేలా పండుగను నిర్వహిస్తుంటారు. పెళ్లి రేలా అంటే ఆదివాసీల పెళ్లిళ్లు చేసుకునేటప్పడు సాయంత్రం వేళ రేలాపాట పాడుతూ ఆటలాడుతారు. ఈ రేలను పెళ్లి రేలా అంటారు. ప్రతి సంవత్సరం జూన్‌ మొదటి వారం చివరి వారం వరకు గిరిజనలు భూమి పండుగను నిర్వహిస్తారు.

ఆదివాసీ సంస్కృతి – సంప్రదాయాలు
ఆదివాసీలు పండుగలే కాదు వారి సంస్కృతి, సంప్రదాయాలను సైతం క్రమం తప్పకుండా పాటిస్తారు. ఆదివాసీలు ప్రతి పనికి సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తప్పనిసరిగా తూచ తప్పకుండా పాటిస్తారు. ఐక్యత, ఒకరి సంస్కృతి మరోకరికి అందేలా చూడటంతో పాటు గిరిజనలు తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ఈ సందర్భంగానే పెళ్ళి, చావు, కర్మకాండలు, పుట్టుక వంటి పలు కార్యక్రమాలలో ఆనాటి ఆచారలను పాటిస్తూ సంప్రదాయాల ద్వారా నిర్వహిస్తారు. ప్రతి చిన్న పని మొదలు పెట్టినప్పుడు పండుగలు నిర్వహించడం ఆదివాసీల ఆచారం. గిరిజనలు ముందుక తోలకరి (భూమి) పండుగను నిర్వహిస్తారు. వేసవి గాలులు వీచే సమయంలో ఈ భూమి పండుగను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా తోలకరి చినుకుల్లో ముందు ఈ రేల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి ఆచార, సంప్రదాయాలను చాటి చేప్తారు. కొత్త పంటలు వేసేటప్పుడు గడ్డి పండుగ, తాటి చెట్టు పండుగ, చిక్కుడు పండుగ, ఇప్ప పండుగలను ఆదివాసీలు నిర్వహిస్తూంటారు. ఆదివాసీలు చివరిగా మామిడి పండుగ నిర్వహించి పండుగలను ముగిస్తారు.

ఆదివాసీ రేలా ఉత్సవాల వివరాలు
రంపచోడవరం కేంద్రంగా ప్రభుత్వ జూనియర్‌ కళశాల ప్రాంగణంలో ఆదివాసీ రేలా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు 24 వ తేదిన ఆదివాసీ రేలా మహా ప్రదర్శనలో భాగంగా డోలు కొయ్యలు, కోలాటం, రేలా ఆట, దింస్సా నృత్యం, డప్పు కళకారులతో వేలాది మందితో ప్రదర్శనలు చేయునున్నారు. రెండవ రోజు 25 వ తేదీన ఆదివాసీ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా మాగూడెం ధింస్సారే నృత్యం, పెర్మకోరు, అందెలు, పెళ్లితంతు, కోలాటం, తొట్టడు, డోలా నృత్యం, రుంజాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడోవ రోజు 26 వ తేదిన దింసా, రేలా జట్టు లాగుట, కొండ కోనల్లో, భూమి పండుగ, రేలా నృత్యం, కోలాటం, గంగచెల్లి, పెళ్లిపాటలు నిర్వహిస్తారు. **

CLICK HERE TO READ Boeing 777 Aircraft | రూట్ మ్యాప్ విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

CLICK HERE TO READ MORE

Leave a Reply