TG | కేసీఆర్‌ను కలిసిన పార్టీ నూతన విప్‌లు..
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పార్టీ విప్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ, శాసనమండలిలో బీఆర్‌ఎస్ పార్టీ విప్‌లుగా నియమితులైన కేపీ వివేకానందగౌడ్, సత్యవతి రాథోడ్‌లు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలుసుకుని… పార్టీ విప్‌లుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారిని కేసీఆర్ సన్మానించారు. అసెంబ్లీ, మండలిలో అధికార పక్షం తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, అసెంబ్లీలో జరిగే చర్చల్లో పార్టీ సభ్యులు పాల్గొనేలా చూడాలని కొత్తగా నియమితులైన విప్‌లకు కేసీఆర్ సూచించారు.