cameras | తాత, నానమ్మ ఎదుటే చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు
cameras | తాత, నానమ్మ ఎదుటే చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు
cameras | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పంజాబ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొహాలీ జిల్లా కురాలి ప్రాంతంలో పట్టపగలే నాలుగేళ్ల బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. అపహరణ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
స్కూటీపై తాతయ్య, నానమ్మతో కలిసి వెళ్తున్న చిన్నారిని దుండగులు బైక్, కారులో వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్లారు. బాలికను కాపాడేందుకు వృద్ధ దంపతులు ప్రయత్నించగా.. వారిపై కారుతో దూసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
ఘటనపై వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

