35 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టివేత
35 క్వింటాల పీడీఎస్ బియ్యం పట్టివేత
- ఇద్దరు నిందితులు, డ్రైవర్, వాహన యజమానులపై కేసు నమోదు
- తరలిస్తున్న వాహనం సీజ్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్ఐ వెంకన్న గురువారం తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని లోక్యతండ పరిధిలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా టీఎస్ 12యుడి 2028 అనే నెంబర్ గల డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా 70బస్తాలు సుమారు 35 క్వింటాల తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేస్తున్న పిడిఎస్ బియ్యంగా గుర్తించారు.
డీసీఎం డ్రైవర్ గౌస్ అందులో ఉన్న వ్యాపారి కాశం భద్రయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా గోల్ బోడుక తండా గ్రామ పంచాయతీ ధన్సింగ్ తండాకు చెందిన డీలర్ బాదావత్ ప్రమీల భర్త శంకర్ దగ్గర ఖరీదు చేసి నకిరేకల్ తీసుకెళుతున్నట్లు గుర్తించారు.వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.నిందితులు భద్రయ్య,శంకర్,గౌస్,వాహన యజమాని భాస్కర్ రెడ్డి నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది బాలాజీ, ప్రవీణ్, మహేష్, జోగేందర్, చంద్రయ్య,సంతులను సీఐ గణేష్,ఎస్ఐ వెంకన్న లు అభినందించినట్లు తెలిపారు.
