ఘనంగా పోచమ్మ మైసమ్మ ప్రతిష్టాపన…

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ 32వ డివిజన్ లోని గాయత్రి నగర్ లో శుక్రవారం శ్రీ పోచమ్మ మైసమ్మ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. ఉదయం నిర్వహించిన పూజా కార్యక్రమంలో డివిజన్ ప్రజలతో కలిసి నరేందర్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో32 వ డివిజన్ బీ ఆర్ఎస్ పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు , స్థానికులు పాల్గొన్నారు.