ఎంపీ .. ఎమ్మెల్సీలను కలిసిన బీఆర్ఎస్ నాయకులు..
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కిళ్ళపల్లి రవీందర్ రావులను హైదరాబాద్ బంజారాహిల్స్ లోని వద్దిరాజు స్వగృహంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కేసముద్రం మునిసిపాలిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్లుగా విజయం సాధించిన ఆగే రాము, పాయిరాల శరత్, రావుల వినయ్ రెడ్డి,దూడపాక కృష్ణలతో పాటు పార్టీ నాయకులు జాటోత్ హరీష్ నాయక్, పురం రమేశ్, మేకల సురేష్, బానోత్ దేవేందర్, కన్నెబోయిన శ్రీను తదితరులు కలిసి సమావేశమై ఇష్టాగోష్టి జరిపారు.
