24 Killed Bla Fidayeen : క్వెట్టాలో నరమేథం Andhra Prabha Top News
24 Killed Bla Fidayeen : క్వెట్టాలో నరమేథం Andhra Prabha Top News
- బీఎల్ఏ ఆత్మాహుతి దాడి
- 24 మంది పాక్ జవాన్లు హతం
- రైలును ఢీకొట్టిన బాంబు వాహనం
- బోగీలు పల్టీ.. కార్లు ధ్వంస
- పాక్ సైన్యంపై బీఎల్ఏ దాడి
- బలూచిస్తాన్‌లో భయానక ఘటన
- పాకిస్థాన్‌లో హై అలర్ట్..!
- క్షణాల్లో భీతావహం
( ఆంధ్రప్రభ, క్వెట్టా ప్రతినిధి )

సహ జ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా..పాకిస్థాన్ నుంచి విముక్తి కోసం సాయుధ పోరాటం చేస్తూ పాకిస్థాన్ ప్రకటిత ఉగ్ర సంస్థగా పేరొందిన ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెలరేగిపోయింది. భార్య బిడ్డలతో ఇంటిల్లిపాది సొంతూళ్లకు బయలు దేరిన సైనికులపై ఆత్మాహుతి దాడికి దిగింది. బాంబు దాడితో భయానక వాతావరణ సృష్టించింది. ఈ ఘోర ఫిదాయీలో 24 మంది దుర్మరణం చెందారు. 82 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అనేక మంది పరిస్థితి విషమంగా మారింది. ఈ దాడిని పాక్ ప్రధాని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం క్వెట్టా ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని పాక్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
24 Killed Bla Fidayeen : క్షణాల్లో విస్ఫోటనం

పాకిస్థాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా సమీపంలో రైలును లక్ష్యంగా చేసుకుని 24 మే 2026, ఆదివారం) ఉదయం ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. క్వెట్టాలోని ‘చమన్ ఫాటక్’ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం 8:00 గంటల ప్రాంతంలో ఈ నరమేదం జరిగింది. తమ కుటుంబ సభ్యులతో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న షటిల్ ప్యాసింజర్ రైలు సిగ్నల్ దాటుతున్న సమయంలో, పేలుడు పదార్థాలతో ఓ వాహనం వచ్చి రైలు బోగీని బలంగా ఢీకొట్టింది. ఈ ఆత్మాహుతి దాడి కారణంగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి రైలు బోగీలు పట్టాలు తప్పి, బోల్తా పడటమే కాకుండా భారీగా మంటలు చెలరేగాయి.

చుట్టుపక్కల భవనాల కిటికీలు, వాహనాలు కూడా ఈ పేలుడుకు ధ్వంసమయ్యాయి. ఈ ఘోర పేలుడులో ఇప్పటి వరకు 24 మంది మరణించారు. మృతులలో ఎక్కువ మంది పాకిస్థాన్ సైనిక సిబ్బంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. 82 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను క్వెట్టాలోని మిలిటరీ ఆసుపత్రి సహా ఇతర ప్రధాన ఆసుపత్రులకు తరలించారు. క్షతగాతరుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ దాడికి తామే బాధ్యులమని నిషేధిత వేర్పాటువాద సంస్థ ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ ప్రకటించింది. పాకిస్థాన్ రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకునే తాము ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ఆ సంస్థ పేర్కొంది.
24 Killed Bla Fidayeen : భోగీలు పల్తీ

పేలుడు ధాటికి రైలు ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రెండు బోగీలు పల్లీ కొట్టాయి. భారీగా మంటలు చెలరేగాయి. రైల్వే ట్రాక్‌కు సమీపంలో ని ఒక నివాస ప్రాంతంలో ఈ దాడి జరగడం వల్ల… చుట్టుపక్కల ఇళ్ళు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాక్ పక్కన పార్క్ చేసిన సుమారు 10 వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కొందరు స్థానికులు కూడా మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది.
24 Killed Bla Fidayeen : ప్రభుత్వం అప్రమత్తం

ఈ ఘోర సమాచారంతో పాకిస్థాన్ సైన్యం పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అత్యవసర విపత్తు నిర్వహణ బృందాలు బోగీల్లో చిక్కుకున్న బాధితులను వెలికితీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్వెట్టాలోని అన్ని ప్రభుత్వ మిలిటరీ ఆసుపత్రులలో వైద్య అత్యవసర పరిస్థితి విధించారు. సెలవుల్లోని డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని వెంటనే విధుల్లోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
24 Killed Bla Fidayeen : రైళ్లు నిలిపివేత
భద్రతా కారణాల దృష్ట్యా పెషావర్ వెళ్లాల్సిన ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’ రైలును క్వెట్టా స్టేషన్ లోనే నిలిపివేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా భద్రతా బలగాలను హై అలర్ట్ లో ఉంచారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
24 Killed Bla Fidayeen : బీఎల్ ఏ షిదాయీ

ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని నిషేధిత వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ అయిన ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ బి.ఎల్.ఎ ప్రతినిధి ‘జీయాండ్ బలోచ్’ ఒక ప్రకటన విడుదల చేస్తూ… క్వెట్టా కంటోన్మెంట్ నుండి సైనిక సిబ్బందిని తరలిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని, తామే అత్యంత వ్యూహాత్మకంగా ఈ ‘ఫిదాయీ’ (ఆత్మాహుతి) దాడికి పాల్పడినట్లు స్పష్టం చేశాడు. పాకిస్థాన్ రక్షణ దళాలు (భద్రతా బలగాలు) సైనిక సిబ్బందిని మట్టుబెట్టడమే లక్ష్యంగా ఈ దాడి చేశామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
24 Killed Bla Fidayeen : స్వాతంత్య్రమే లక్ష్యం

బలూచిస్తాన్ ప్రాంతం సహజ వనరులు (చమురు, ఖనిజాలు) అధికంగా ఉన్నప్పటికీ, పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా ఆ వనరులను దోపిడీ చేస్తోందని ఈ సంస్థ ఆరోపిస్తోంది. పాకిస్థాన్ నుండి బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు పూర్తి స్వాతంత్య్రం కావాలని దశాబ్దాలుగా ఈ బి.ఎల్.ఎ (BLA) సంస్థ సాయుధ పోరాటం చేస్తోంది. ఇటీవల కాలంలో పాకిస్థాన్ భద్రతా బలగాల చేతిలో తమ సంస్థ భారీగా నష్టపోయిందని, దానికి ప్రతికారంగానే ఈ భారీ ఆత్మాహుతి దాడికి ఒడిగట్టారని స్థానిక రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా ఈ ఉగ్రవాద సంస్థ పాకిస్థాన్‌లోని రైళ్లు, రైల్వే ట్రాక్‌లు చైనా పెట్టుబడులతో నిర్మిస్తున్న ప్రాజెక్టులను (CPEC) లక్ష్యంగా చేసుకుని పలుమార్లు దాడులు చేసింది
ALSO READ : 1 Dead Trump Safe : వైట్ హౌస్ లో కాల్పుల కలకలం Andhra rabha Top News
