Suryapeta | శిశువుల‌ను విక్ర‌యిస్తున్న ముఠా అరెస్ట్

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో శిశువుల‌ను విక్ర‌యిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు మ‌హిళ‌లు, న‌లుగురు పురుషుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా స‌భ్యుల వ‌ద్ద 16 నెల‌ల మ‌గ శిశువును పోలీసులు గుర్తించారు.

శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారుల‌కు అప్ప‌గించారు పోలీసులు. ఇప్ప‌టికే ఈ ముఠా 22మంది శిశువుల‌ను విక్ర‌యించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. రాజస్థాన్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, గుజ‌రాత్ నుంచి శిశువుల‌ను ఇక్క‌డికి తీసుకువ‌చ్చి విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు. ఒక్కో శిశువును రూ.3ల‌క్ష‌ల నుంచి రూ. 7ల‌క్ష‌ల‌కు అమ్ముతున్న‌ట్లు తేలింది.

Leave a Reply