కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి పి.4.

కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి పి.4.

టీడీపి బొండా యువ నాయకుడు బొండా రవితేజ.

పాయకాపురం, ఆంధ్రప్రభ : పి.4 పథకం స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నామని టీడీపీ యువ నాయకుడు బొండా రవితేజ అన్నారు.స్థానిక 32వ డివిజన్ శాంతినగర్ మొదటి లైన్ చివర తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ మార్గదర్శిగా గత రెండు సంవత్సరాల క్రితం హార్ట్ ఆపరేషన్ అనంతరం తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా కాలు తొలగించాల్సి వచ్చిన తాటిపర్తి ఆదినారాయణని స్వయంగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పి.4 పథకం ద్వారా రూ.9 వేల విలువైన వీల్ చైర్‌ను అందజేశారు.

అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మట్టా రవికుమార్ గత 20 సంవత్సరాలుగా పెరాలసిస్ సమస్యతో బాధపడుతూ ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్న విషయం తెలుసుకున్న బొండా రవితేజ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ నెలవారీ నిత్యావసర సరుకులు, బియ్యం బస్తా అందజేయడంతో పాటు తన సొంత నిధుల నుండి రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని కూడా వారి కుటుంబానికి అందించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ వెలగ సురేష్, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి. శేషుబాబు,మాజీ అధ్యక్షుడు పరసా నగేష్, డివిజన్ సెక్రెటరీ నవీన్, మహిళా కమిటీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply