21st | ఏ కేసులో అంటే…

21st | ఏ కేసులో అంటే…
21st | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబుపై సాక్షులను బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటి ఆరోపణలు వెలువడ్డాయి. ఈ మేరకు ఈ నెల 21న కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం పోలీసులు అనంతబాబును అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, కాకినాడ మొబైల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
