జనగణన శిక్షణ కార్యక్రమం ప్రారంభం..

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా రెండవ బ్యాచ్ ఎనమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం శనివారం స్థానిక గర్ల్స్ జూనియర్ కాలేజీలో ప్రారంభమైంది. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.పాండు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 212 హెచ్‌ఎల్‌బీలకు సంబంధించిన రెండవ విడత శిక్షణలో భాగంగా 150 మంది సిబ్బందికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం, డేటా సేకరణ విధానాలు, ఫీల్డ్‌లో పాటించాల్సిన మార్గదర్శకాలను ట్రైనర్ల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఛార్జ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ శ్రీకాంత్, ఫీల్డ్ ట్రైనర్లు పాల్గొన్నారు.

Leave a Reply