ప్రజల దహర్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు..

చిట్యాల, ఆంధ్రప్రభ : వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు చిట్యాల గ్రామపంచాయతీ సర్పంచ్ తౌటం లక్ష్మీ అన్నారు. శనివారం మండల కేంద్రం, చౌరస్తాలోని ప్రెస్ క్లబ్ ముందు, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ లక్ష్మి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని వేసవి కాలంలో ప్రజలు ప్రతినిత్యం వారి అవసరాల నిమిత్తం బస్టాండ్ వస్తుంటారని , ప్రజల దప్పిక తీర్చేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సర్పంచి లక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డు మెంబర్లు తవుటం నవీన్, జెట్టి కుమార్, మైదం శ్రావ్య- శ్రీకాంత్ , పంచాయతీ కార్యదర్శి దేవేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
