150 years | వందేమాతరంపై పార్లమెంటులో చర్చ

150 years | వందేమాతరంపై పార్లమెంటులో చర్చ

  • ప్రారంభించిన మోదీ

150 years | ఢిల్లీ, ఆంధ్రప్రభ : వందేమాతరంకు 150 ఏళ్ల(150 years) సందర్భంగా దేశభక్తి గేయంపై పార్లమెంట్‌లో చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్‌(Parliament) వేదికైంది. లోక్‌సభలో సోమవారం ప్రధాని మోదీ ఆ చర్చను ప్రారంభించారు.

మొత్తంగా ఈ చర్చ కోసం దిగువ సభలో 10 గంటల సమయాన్ని కేటాయించారు. విపక్ష కాంగ్రెస్‌ తరఫున వందేమాతరంపై లోక్‌సభలో పార్టీ ఉప నేత గౌరవ్‌ గొగొయ్, ఎంపీ ప్రియాంకాగాంధీ(MP Priyanka Gandhi) వాద్రా తదితరులు మాట్లాడనున్నారు.

రాజ్యసభలో వందేమాతరంపై చర్చను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మంగళవారం ప్రారంభించనున్నారు. ఆయన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా ప్రసంగిస్తారు.

Leave a Reply