గొల్లపల్లి–మైలారం బీటీ రోడ్డు పనులకు శ్రీకారం
రూ.1.70 కోట్లతో రహదారి నిర్మాణం..
హామీని నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే గడ్డం వినోద్
నెన్నెల, ఆంధ్రప్రభ: మండలంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గొల్లపల్లి–మైలారం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకుస్థాపన చేశారు.
రూ.1.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పాలకులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తాము గ్రామాల సమగ్ర అభివృద్ధినే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
జోగాపూర్ రోడ్డు నుంచి మైలారం బ్రిడ్జి వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు జాడి రాజ్‌కుమార్, పున్సోతు నారాయణ, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బొమ్మన హరీష్ గౌడ్, జిల్లా కార్యదర్శి సుంకరి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గట్టు మల్లేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గోలేటి సంధ్య, చిన్నోజు శంకరయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్ల గౌడ్, యూత్ నాయకులు కంపెల రాజశేఖర్, ప్రేమ్ సాగర్ గౌడ్, కామరా అనిత, గడ్డం చంబమూర్తి, సింగర్తి తిరుపతి, తోట శ్రీనివాస్, తమ్మినేని రాజేష్, వరం శంకర్, ఎండీ నజీర్, గడ్డం వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
