2026election | రేపే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

2026election | రేపే ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

2026election | తొలి మూడు గంట‌ల్లోనే ట్రెండ్స్ తెలిసే అవ‌కాశం
బెంగాల్‌లో దీదీతో క‌మ‌ల‌నాథుల హోరాహ‌రీ పోరు
త‌మిళ‌నాడులో డీఎంకకే, ఎన్డీఏ కూట‌మి మ‌ధ్య పోటీ
కేర‌ళ‌లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్
అసోం , పుదుచ్చేరిలో ఎన్డీఏకి కేక్ వాక్

2026election |న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. మే 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాల్లో.. ఏక కాలంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మొదటి ఒకటి మూడు గంటల్లోనే తొలి ట్రెండ్‌లు వెలువడతాయని ఎన్నికల సంఘం తెలిపింది. మధ్యాహ్నం కల్లా మెజార్టీ ఎవరిదని, సాయంత్రం 4 గంటలకల్లా విజయం ఎవరిదో తేలిపోనుంది.

భారీ ఓటింగ్ ఏ పార్టీకి ఎవ‌రికి అనుకూల‌మో?

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్‌‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. బెంగాల్‌‌లో అత్యధికంగా 92 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు కాగా.. అస్సాంలో రికార్డు స్థాయిలో 85.38 శాతం మంది ఓటేశారు. తమిళనాడులో 84.69 శాతం, కేరళలో 79.63 శాతం, పుదుచ్చేరిలో 89.87 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూమ్‌‌ల వద్ద అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఫలితాల కోసం కేవలం ఆయా రాష్ట్రాల ప్రజలే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు మరియు సామాన్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ముఖ్యమంత్రుల భవితవ్యం తేలే రోజు..

ఈ ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడులో ఎం.కె. స్టాలిన్, కేరళలో పినరయి విజయన్ వంటి అగ్రనేతల రాజకీయ ప్రస్థానానికి ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై కూడా బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం..

సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాల భద్రతా మరియు సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసింది. గతాన్ని మించి ఈసారి భారీగా పోలింగ్ నమోదు కావడంతో, ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మిశ్రమ ఫలితాలను సూచించడంతో గెలుపోటములపై అంచనాలు వేయడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.

బెంగాల్‌లో బీజేపీ, తృణ‌మూల్ మ‌ధ్య పోరు..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 294 స్థానాలు ఉన్న బెంగాల్‌లో ఏప్రిల్ 23తొలి విడత జరగ్గా ఇవా రెండు విడత ఎన్నికలు జరిగాయి. అయితే రెండు విడతల్లోనే రాష్ట్రంలో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. దీంతో ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అటు దీదీ పట్టుదలతో ఉన్నారు.

త‌మిళ‌నాడులో..

త‌మిళానాడు . రాష్ట్రంలో ఉన్న మొత్తం 234 స్థానాలకు గాను ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ సారి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 85 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. అయితే ఈ సారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. గతంలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉండగా ఈ సారి మాత్రం నటుడు విజయ్ టీవీకే ఎంట్రీలో మూడు పార్టీల మధ్యే పోటీ నెలకొంది.

కేర‌ళ‌లో ఎల్డీఎఫ్ – యూడీఎఫ్ మ‌ధ్య పోరు..

ఇక కేరళా విషయానికి వస్తే ఇక్కడ ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 140 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగ్గా సుమారు 74 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ నేత విజయన్ ధీమాగా ఉండగా, ఈసారి మార్పు వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అటు అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజోత్ కూటమికి మధ్య గట్టి పోటీ నెలకొంది. సీఎం హిమంత బిశ్వ శర్మ, గౌరవ్ గొగొయ్ మధ్య ప్రచార పర్వం జోరుగా సాగింది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుద్దుచ్చేరిలో కూడా ఎన్డీయే, ఇండియా బ్లాక్ మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా ఎన్నికలు జరిగాయి.

అస్సాంలో హేమంత’ మ్యాజిక్..

అస్సాంలోని మొత్తం 126 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నాయకత్వంలో బీజేపీ మరోసారి విజయదుందుభి మోగించబోతున్న‌ట్లు ప్రీ పోల్ స‌ర్వేలు చెబుతున్నాయి. 126 స్థానాలున్న అస్సాంలో బీజేపీ కూటమి ఏకంగా 88 నుంచి 101 సీట్లను కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ కేవలం 15-36 సీట్లకే పరిమితం కానుంద‌ని వార్తాలు విన‌వ‌స్తున్నాయి.

పుదుచ్చేరిలో ఎన్డీయే.. మైనారిటీ ఓట్లు ఎటు?

చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో 30 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల‌లో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రామ‌స్వామి సార‌థ్యంలోని ఎన్డీయే తన ఆధిపత్యాన్ని చాటుకోనుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. 30 సీట్లు ఎన్‌ఆర్‌సీ-బీజేపీ కూటమి 16-19 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ కూటమి 10-12 స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చోనుంది. అత్యధికంగా 89 శాతం పోలింగ్ నమోదు కావడం ఇక్కడ విశేషం.

CLICK HERE TO READ

CLICK HERE TO READ MORE 11Districts Iదీదీ హ్యాట్రిక్ స్కోరు చేస్తారా? కమలం వికసిస్తుందా?

Leave a Reply