NEET Protest | నీట్ పేపర్ లీక్‌పై నిరసన..

NEET Protest | నీట్ పేపర్ లీక్‌పై నిరసన..

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్

NEET Protest | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం, విద్యా వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టనున్న ధర్నాకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. జంతర్‌మంతర్ వేదికగా జరగనున్న ఈ నిరసన కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇప్పటికే అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఆయన, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేసింది. రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ధర్నాకు హాజరై తమ నిరసనను తెలియజేయాలని పార్టీ పిలుపునిచ్చింది.