ప్రజా సేవే లక్ష్యం

వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి .రోహిణి మసడె

ఆసిఫాబాద్ ఫిబ్రవరి 4 ఆంధ్రప్రభ : ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రజాసేవ లక్ష్యంగా మీ వెన్నంటే ఉంటు సమస్యల పరిష్కరనికి కృషి చేస్తానని వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి .రోహిణి మసడె అన్నరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనత పార్టీ అభ్యర్థిగా 19 వ. వార్డ్ కౌన్సిలర్ గా పోటీచేస్తునని ఒక్క అవకాశం ఇవ్వండి..మీ వెన్నంటే ఉంటాను. నన్ను గెలిపించే బాధ్యత మీది..అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ప్రజలను కోరారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.
తాగునీరు, సాగునీరు, విద్యుత్, రోడ్లు, పరిశుభ్రతతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి కౌన్సిలర్‌గా పనిచేస్తానన్నారు.
సంపాదన కోసం కాకుండా వార్డు అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఆశీర్వదించి కౌన్సిలర్‌గా గెలిపిస్తే సేవ చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని అభ్యర్థి రోహిణి మసడె తెలిపారు

Leave a Reply