అశ్రునయనాల మధ్య లింగారెడ్డి అంత్యక్రియలు
అశ్రునయనాల మధ్య లింగారెడ్డి అంత్యక్రియలు
- పాడేమోసిన మాజీమంత్రి ,మాజీ డిసిసి అధ్యక్షులు
మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు లింగారెడ్డి అంత్యక్రియలు బుధవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. కుటుంబములు విషాద ఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు వేలాది మంది రాకతో న్యూ సాంగ్వి జన సంద్రమైంది. పాడెను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకన్ రెడ్డి ,మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు, మాజీ డిసిసిబి డైరెక్టర్ హరీష్ కుమార్ లతోపాటు ఇతర నాయకులు మోశారు.
అంత్యక్రియలకు జిల్లాతో పాటు వివిధ మండలాల నుంచి ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు ,ప్రజలు, బంధుమిత్రులు, స్నేహితులు అంత్యక్రియలో పాల్గొని ప్రగాఢ సంతాపం తెలిపారు.
