Gita worker | గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు

Gita worker | గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు
- హుటాహుటిన ఆసుపత్రి తరలించిన తోటి గీతా కార్మికులు
Gita worker | కరీమాబాద్, ఆంధ్రప్రభ : తాటి చెట్టు పై నుండి కిందపడిన గీత కార్మికుడు తీవ్ర గాయాల పాలయ్యారు. నగరంలోనిబట్టుపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న పూజారి రవి (45) గీతాకార్మికుడు. అమ్మవారిపేట ప్రాంతంలో ఈ రోజు లాగే తాటిచేట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తున కాలు జారి పడడంతో రెండు కాళ్ళు వీరిగాయనీ తోటి గీతా కార్మికులు తెలిపారు.
అక్కడే ఉన్న తోటి కార్మికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.
