చెన్నూరులో వేగవంతంగా సర్ ప్రక్రియ

చెన్నూర్ ఆంధ్రప్రభ :మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఎస్‌ఐఆర్ ఓటర్ హెల్ప్ డెస్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌ఓతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
వార్డు పరిధిలోని ఓటర్లకు ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటరు నమోదు, వివరాల మార్పులు వంటి సేవలపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సమాచారం, సహాయాన్ని అందించారు.ఓటర్లందరూ తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైతే నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, 17వ వార్డు కౌన్సిలర్ అజీముద్దీన్ మహమ్మద్ బీఎల్‌ఓలు నాయకులు పెద్దింటి శ్రీనివాస్,పాతర్ల నాగరాజు,సాధనబోయిన కృష్ణ, బషీరొద్దీన్,చెన్న సూర్యనారాయణ,సద్ది కిరణ్ పాల్గొన్నారు.