అమరావతి : ఏపీలో ఎన్నికలకు ముందు లారీ యజమానుల సంఘాలతో జరిగిన పలు భేటీల్లో కూటమి హరిత పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఈ పన్నును తగ్గిస్తున్నట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో వాహనదారులు గరిష్టంగా ఏటా రూ.20 వేల వరకు హరిత పన్నును చెల్లించేవారు. కేబినెట్ నిర్ణయంతో ఇకపై 7-12 ఏళ్ల వాహనాలకు ఏడాదికి రూ.1,500, అలాగే 12 ఏళ్లు దాటిన వాహనాలకు రూ.3 వేల హరిత పన్నును ప్రభుత్వం వసూలు చేయనుంది.
AP| లారీ యజమానులకు గుడ్ న్యూస్ – హరిత పన్ను తగ్గింపు
