15 tips | నో టెన్షన్! ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చిట్కాలు
15 tips | నో టెన్షన్! ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చిట్కాలు
15 tips | ఒత్తిడి ఎందుకు వస్తుంది?
రోజువారీ అలవాట్లతో ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి
ఆహారంతో ఒత్తిడిని నియంత్రించే మార్గాలు
యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత
ఒత్తిడికి గురైతే కనిపించే లక్షణాలు
ఎప్పుడు నిపుణుల సహాయం తీసుకోవాలి?
15 tips | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : మనిషి జీవితంలో ఒత్తిడి అనేది సహజం. ఉరుకుల పరుగుల జీవనంలో అనేక రకాలుగా ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు తదితర కారణాల వల్ల ఒత్తిడికి చిత్తవుతారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్య ఉంటుంది. సామాన్యులు, మేధావులు, దిగ్గజాలు ఎవరైనా ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. ఒత్తిడి వల్ల ఆందోళన, కుంగుబాటు, గుండెజబ్బులు, స్ట్రోక్ వంటి మానసిక, శారీరక సమస్యలెన్నో వస్తాయి. ఇలా చేస్తే మంచిది..

– ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఏ పని మీద అయితే ఇష్టం ఉంటుందో అందులో బిజీగా మారిపోవాలి.
– రోజూ తీసుకునే ఆహారం ద్వారా కూడా ఒత్తిడిని అదుపు చేసుకోవచ్చు. – డార్క్ చాక్లెట్, గుడ్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు, చామొమైల్ టీ వంటివి తీసుకుంటే మంచిది.
– వీటిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. – డైట్‌లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ వంటి వివిధ రకాల ఆహారాలను తీసుకోవాలి.
– ప్రాసెస్ చేసిన ఫుడ్స్, చక్కెర ఆహారాలకు దూరంగా ఉండండి. – వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని కలుగజేసే కార్టిసాల్ హార్మోన్ స్థాయిల్ని అదుపులో ఉంటుంది.
– ఒత్తిడిగా అనిపించినప్పుడు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, మనసుకు నచ్చిన వారితో కాసేపు సమయం గడపడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
– ప్రశాంతంగా కూర్చుని దీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల హృదయ స్పందన రేటు తగ్గి, మనస్సు ప్రశాంతపడుతుంది.
– రోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల ఆలోచనలు నియంత్రణలోకి వస్తాయి. – పౌష్టికాహారం తీసుకోవడం మరియు రోజుకు 7-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం.
– మీకు ఒత్తిడిని కలిగించే విషయాలు (పని, సంబంధాలు) ఏమిటో గుర్తించి వాటిని తగ్గించుకోవాలి. – పనులను వాయిదా వేయకుండా, సమయానికి పూర్తి చేయడం ద్వారా ఆందోళన తగ్గుతుంది. – అవసరం లేని పనులకు ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి.
– పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, లేదా హాబీలను అనుసరించడం ద్వారా ఒత్తిడి మర్చిపోవచ్చు.
– ఇవేవి సత్ఫలితాలు ఇవ్వకుంటే మానసిక నిపుణుల్ని సంప్రదించడం మంచిది
.ఒత్తిడికి గురైతే కనిపించే లక్షణాలు
• మాటి మాటికీ తలనొప్పి వస్తూ ఉండడం
• మెడ నొప్పి మరియు వెన్ను నొప్పి
• తరచుగా కండరాలు పట్టేస్తుండడం మరియు ఒంటి నొప్పులు వంటివి ఒత్తిడి సమస్యకు ప్రాథమిక లక్షణాలు.
• విపరీతమైన అలసట
• అజీర్తి (అజీర్ణం)
• బీపీ పెరిగి ఎక్కువగా కోపం రావడం
• చిన్న వాటికే చిరాకు పడుతూ ఉండటం
• పనిపై ఏకాగ్రత లేకపోవడం
• బాగా అలస్యంగా నిద్రపట్టడం లేదా అసలు నిద్ర పట్టకపోవడం
• ఆకలి లేకపోవడం
• నలుగురిలోకి వెళ్లడానికి ఆసక్తి చూపకపోవడం
• ఉన్నట్లుండి ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడడం
• గతంలో జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు రావడం
• ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండడం
• తరచూ ఛాతీలో నొప్పి, గుండె దడగా ఉండటం
click here to read 13 to 19 yrs | అమ్మాయిల్లో నెలసరి అసమానత: కారణాలు, లక్షణాలు, పరిష్కారాలు
