Spider-Man ‘బ్రాండ్ న్యూ డే’పై బిగ్ బజ్.. ఒక రోజు ముందే..

Spider-Man ‘బ్రాండ్ న్యూ డే’పై బిగ్ బజ్.. ఒక రోజు ముందే..

  • టామ్ హాలండ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..
  • ‘బ్రాండ్ న్యూ డే’ అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే…

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man on Brand New Day) సినిమాపై ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతర్జాతీయ విడుదల తేదీ కంటే ఒక రోజు ముందుగానే ఈ చిత్రం భారత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 31న విడుదల కానుండగా, భారత్‌లో మాత్రం జూలై 30నే విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 17 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావచ్చని, వచ్చే వారం రెండో ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని స‌మాచారం.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం, స్పైడ‌ర్ మ్యాన్: నో వే హోం తర్వాత స్పైడర్‌మ్యాన్ కథను ముందుకు తీసుకెళ్లనుంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘నో వే హోమ్’ ముగింపుతో ఏర్పడిన ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానాలు దొరికే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ చిత్రంలో మరోసారి టామ్ హాలండ్ స్పైడర్‌మ్యాన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే జెండయా, జాకబ్ బటలోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ షాంగ్ చీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నది డెస్టిన్ డేనియల్ క్రెటన్, ఈయనే దీనికి దర్శకత్వం వహించారు.

అయితే ప్రస్తుతం భారత్‌లో ముందస్తు విడుదల, అడ్వాన్స్ బుకింగ్స్, రెండో ట్రైలర్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply