19వ వార్డులో ఘనంగా వార్డు సభ..
19వ వార్డులో ఘనంగా వార్డు సభ..
- సమస్యల పరిష్కారానికి కమిషనర్, చైర్మన్ కు విన్నపం
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వార్డు సభను నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించగా ఈ సభకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై, తమ వార్డులో నెలకొన్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పావు శెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుండి స్వీకరించిన వినతులను క్రోడీకరించి, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వార్డు సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చైర్మన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం దిశగా కొనసాగుతున్నటువంటి ఈ వార్డు సభలు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాయని ప్రజలకు చేరువ అయ్యే విధంగా వారితో మాట్లాడడం జరుగుతుందని, ఇటువంటి ప్రజలకు చేరువయే కార్యక్రమాలు గతంలో ఎవ్వరు ఏ ప్రభుత్వం కూడా చేయలేని విధంగా మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో కొనసాగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సందీప్ రెడ్డి, వార్డు ఆఫీసర్ బుచ్చిరాజు, ఎండి రంజాన్ అలీ, ఎండి షఫీ, దుప్పటి రాజేష్, జేరిపోతుల గోపి, పూసల సదానందం, లక్కం బిక్షపతి, ఉంటేరు సురేష్, జావిద్, నజీర్, కుమార్, ఏకు సురేష్, వక్కిలి రాహుల్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
