బస్సు స్టాప్ లేకపోవడంతో..

బస్సు స్టాప్ లేకపోవడంతో..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ నందు అనేక మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. వారి అవసరాల నిమిత్తం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామము వద్ద ఎక్స్ ప్రెస్ బస్సు స్టాప్ లేని కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తమ పిల్లలను కలవడానికి వివిధ ప్రాంతాల నుండి వారి తల్లిదండ్రులు నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల పాఠశాలకు వచ్చిపోతుంటారు. నచ్చని ఎల్లాపూర్ గ్రామం వద్ద ఎక్స్ ప్రెస్ బస్సు స్టాప్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

వారి పరిస్థితులను అర్థం చేసుకొని కడెంకు చెందిన సామాజికవేత్త ఛత్రపతి సిహెచ్ రాజేష్ కుమార్, నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ పండరికి పరిస్థితిని వివరించారు. ఎక్స్ ప్రెస్ బస్సు రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేస్తే.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించి వినతి పత్రంను అందజేశారు. ఈ కార్యక్రమంలో కడెం పెద్దూరు గ్రామాలకు చెందిన నాయకులు, యువకులు, బోర్లకుంట లక్ష్మణ్, బైరి శ్రీనివాస్, గుండబోయిన ముత్యాలు, రెంకల పరమేష్, ఎండి మాజిద్, శివరాత్రి వెంకటేష్. పాల్గొన్నారు.

Leave a Reply