మహిళాల భద్రతకు, ఫిర్యాదుపై షీ టీం అవగాహన
మహిళాల భద్రతకు, ఫిర్యాదుపై షీ టీం అవగాహన
కే.సముద్రం, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా ఎస్పి డా. పి. శబరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ షీ టీం కే.సముద్రం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం షీ టీం మహిళల భద్రత గురించి ఈ క్రింది గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పరపల్లి గ్రామం, బిచ్చ తండా, సప్పిడిగుట్టతండా (అమీనాపురం) గ్రామాల యందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న మహిళా కూలీల భద్రతను దృష్టిలో ఉంచుకుని షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్సై సునంద మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రత, అలాగే పని ప్రదేశాలలో జరిగే దోపిడీ, వేధింపులు, మోసపూరిత చర్యల గురించి వివరించారు. షీ టీం ఎస్సై మహిళలకు వ్యక్తిగత భద్రతా చర్యలు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, పోలీస్ సహాయం పొందే మార్గాలపై అవగాహన కల్పించారు. అలాగే మహిళలు తమ హక్కులను తెలుసుకొని, ఎటువంటి వేధింపులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మహిళలకు డయల్ 100/112, మహబూబాబాద్ షీ టీం నెంబర్: 8712656935 , ఇతర అత్యవసర సేవలు సైబర్ టోల్ ఫ్రీ నెంబర్1930 గురించి వివరాలు తెలియజేశారు. గ్రామ స్థాయిలో సమిష్టి సహకారంతో భద్రతా వాతావరణాన్ని సృష్టించు కోవాలని, మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సర్పంచ్, వార్డు సభ్యులు , ఉపాధి హామీ సిబ్బంది, నందు షీ టీం ఏఎస్ఐ సుధాకర్, అరుణ,పార్వతి తదితరులు పాల్గొన్నారు.
