Weather | పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు

హైదరాబాద్‌లోనూ సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం
ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు
మేఘావృత వాతావరణం కొనసాగుతుందని వాతావరణ అంచనా

Weather | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో రానున్న గంటల్లో చెదురుమదురు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతంగానే ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.