elections | ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి..

elections | ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి..

elections | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటర్ తమ ఓటుహక్కును(suffrage) వినియోగించుకోవాలని మండల ప్రత్యేక అధికారి డా.బాలకృష్ణ అన్నారు. జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా, పీడీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికలు-2025 ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మండల అధికారులు, మహిళలతో కలిసి ఓటు ప్రాముఖ్యతపై ప్రతిజ్ఞ చేశారు. ఈనెల 17వ తేదీన జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో(elections) అందరూ ఓటు వేసి మండలాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట శివానంద్, తహసీల్దార్ మహ్మద్ అబిద్ అలీ, ఎస్.ఐ.రాజేష్ రెడ్డి, డిపిఎం శంకర్, ఏపీఎం తిలక్, ఆశాజ్యోతి మండల సమాఖ్య భాద్యులు, మహిళలు పాల్గొన్నారు.