అధిక ధరలకు డిఎపి అమ్మకాలు అధికారులు ఎక్కడ?
అధిక ధరలు నియంత్రించకపోతె ఆందోళన తప్పదు
బిజెపి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు
వెంకట్రాములు ముదిరాజ్
మక్తల్ , ఆంధ్రప్రభ : అధికారుల నిర్లక్ష్యం వల్ల మక్తల్ లో ఫర్టిలైజర్ వ్యాపారులు అధిక ధరలకు డిఎపి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకట్రాములు ముదిరాజ్ డిమాండ్ చేశారు. శనివారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మక్తల్ మండలంలో డిఏపి ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నియంత్రణ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫర్టిలైజర్ వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలను పెంచి అమ్ముతున్నారని అన్నారు. దీనితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .ఎమ్మార్పీ 1350 ఉంటే రూపాయలు ఉంటే 19 వందలు నుండి రూ.2500 వరకు విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. రైతులు వర్షాలు రాక ఎన్నో ఇబ్బందులకు గురై విత్తనాలు వేసిన వర్షాలు రాకపోవడంతో అప్పుల పాలై మదన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దాంతోపాటు అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేసి పంటలు వేయడంతో రైతులు నష్టపోయి అప్పుల పాలు అవుతున్నారని అన్నారు. వ్యాపారులు ఇస్తానుసారంగా ధరలు పెంచి రైతులను నట్టేట ముంచుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. స్థానిక అధికారులతో పాటు జిల్లా అధికారులు స్పందించి అధిక ధరలకు డీఏపీ విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ప్రభుత్వము అమలు చేయాలిహని వెంటనే జిల్లా కలెక్టర్,అధికార యంత్రాంగం స్పందించి ఎరువుల అధిక ధరలను నియంత్రించ కుంటే నారాయణపేట జిల్లా కిషన్ మోర్చా తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా అధ్యక్షులు వెంకట్రాములు ముదిరాజ్ హెచ్చరించారు. ఈ విలేఖరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి .బలరాం రెడ్డి, మక్తల్ మండల అధ్యక్షుడు ఎం. ప్రతాపరెడ్డి, మహాద్వార్ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ సర్పంచ్ శంకర్ మహదేవమ్మ, ఖానాపురం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
